ఠాణాల్లో ‘మోడల్‌ రిసెప్షన్‌' సెంటర్లు

Mon,September 9, 2019 12:30 AM

కొత్తగూడెం క్రైం, సెప్టెంబర్‌ 8: తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖలో అమలవుతున్న 17 వర్టికల్స్‌ విధానంలో భాగంగా మొదటి అంశం ‘మోడల్‌ రిసెప్షన్‌'. ఈ పేరు వినడానికే కాదు ఆచారణలో కూడా అలానే ఉంటుంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లాలో ఉన్న 31 పోలీస్‌ స్టేషన్లకు గాను 25 ఠాణాల్లో ఈ రిసెప్షన్‌ సెంటర్లను జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌ ఏర్పాటు చేయించారు. మిగతా ఆరు ఠాణాల్లో రెండు ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లు కాగా, మరో నాలుగు ఏజెన్సీలో పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. ఈ పోలీస్‌ స్టేషన్లలో త్వరలో రిసెప్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు.
ప్రజలకు జవాబుదారి తనంగా ఉంటుంది:
జిల్లా ఎస్పీ సునీల్‌ దత్‌
జిల్లాలోని దాదాపు అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేకమైన రిసెప్షన్‌ కేంద్రాలను ఏర్పాటు చేశాం. త్వరలోనే మిగతా అన్ని ఠాణాల్లో ఈ రిసెప్షన్లను ఏర్పాటు చేస్తాం. ఈ కేంద్రాలు ఠాణాలకు వచ్చే బాధితులకు మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు, వారి ఫిర్యాదుల సేకరణలో తోడ్పాటునిస్తారు. ఈ రిసెప్షన్‌ కేంద్రాల ఏర్పాటుతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది వ్యవహారశైలిలో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చాయి. అంతే కాదు ఈ కేంద్రాల వల్ల ఫిర్యాదుదారులకు, నేరస్తులకు మధ్య ఎటువంటి ఇబ్బందులు లేకుండ ఉండడంతో పాటు, మధ్యవర్తిత్వాలు సైతం తగ్గుముఖం పడుతున్నాయి. బాధితులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌ ఠాణాలకు వస్తున్నారు. ఫిర్యాదు స్వీకరించిన రిసెప్షనిస్టులు వెంటనే స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో లేదా విచారణాధికారి చర్యలు తీసుకుంటారు. ‘ఫ్రెండ్లీ పోలీసింగ్‌'ని అమలు చేయడంలో భాగంగా పోలీస్‌ శాఖలో అనేకమైన నూతన మార్పులను తీసుకువస్తూ, ప్రజలతో మమేకమవుతున్నాము. శాంతిభద్రతల పరిరక్షణే పోలీస్‌ శాఖ ధ్యేయంగా పనిచేస్తున్నాం.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles