మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట

Mon,September 9, 2019 12:31 AM

పాలేరు రిజర్వాయర్‌లో చేపపిల్లలు వదిలిన ఎమ్మెల్యే కందాల
కూసుమంచి, సెప్టెంబర్‌ 8: ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాయకన్‌గూడెం శివారులో పాలేరు జలాశయం పెన్‌కల్చర్‌ ప్లాంట్‌ సమీపంలో ఆదివారం ఆయన చెరువులో చేపపిల్లలను వదిలారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో చెరువుల్లో చేపలు పెంచుకునే మత్స్యసహకారం సంఘాలు సొంతఖర్చుతో చేపపిల్లలను సమకూర్చుకునేవారని, ప్రత్యేక రాష్ట్రంలో గతనాలుగేళ్లుగా ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలను సరఫరా చేయడమే కాకుండా, మత్స్యకారులకు వలలు, వాహనాలు ఇతర సదుపాయాలను కల్పిస్తుందని వివరించారు. జిల్లాలోని మత్స్యకారుల అభివృద్ధికోసం రూ.30 కోట్టు ఖర్చు చేసినట్లు తెలిపారు. జిల్లాలో గత ఏడాది 622 చెరువుల్లో చేపపిల్లలు పోయగా, ఈసారి 988 చెరువుల్లో రూ. 4.50 కోట్ల విలువైన 3.98 కోట్ల చేపపిల్లలను నూరుశాతం సబ్సిడీతో పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే చెప్పారు. దీనివల్ల 13,907 మంది మత్స్యకారులకు లబ్ధి చేకూరుతుందన్నారు. జిల్లాకు సాగర్‌నీటి వరప్రధాయిని అయిన పాలేరు రిజర్వాయర్‌ ప్రస్తుతం రూ. 5.50 లక్షల విలువైన 5లక్షల చేపపిల్లలను పోస్తున్నామని, మొత్తం 13 లక్షల పిల్లలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అయితే బతుకుల శాతంతో పాటు ఈచెరువు విస్తీర్ణానికి అనుగుణంగా కనీసం 30 లక్షల చేపపిల్లలకు ఇండెంట్‌ ఇవ్వాలని మత్స్యకారుల విజ్ఞప్తిమేరకు మత్స్యశాఖ ఏడీ బుచ్చిబాబును ఎమ్మెల్యే ఆదేశించారు. దీనిపై తాను మత్స్యశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడుతానని ఆయన హామీఇచ్చారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో 129 చెరువుల్లో చేపపిల్లలు పోయడానికి ప్రణాళిక సిద్ధమైందని ఎడీ బుచ్చిబాబు తెలిపారు. ఈకార్యక్రమంలో మత్స్యసహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

169
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles