భద్రాద్రి రామయ్యకు నిత్యకల్యాణం

Tue,September 10, 2019 12:03 AM

భద్రాచం, నమస్తే తెలంగాణ : భద్రాచలం రామాలయంలో సోమవాం శ్రీసీతారామచంద్రస్వామికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామికి సుప్రభాత సేవ, గోదావరి నుంచి తీర్థబిందెతో అభిషేకం చేశారు. ఆరాధన, అర్చన, సేవాకాలం, నివేదన పూజలు నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రామున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని లక్ష్మీతాయారు, అభయాంజనేయస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి, సీతమ్మ నగలను తిలకించారు. అనంతరం అర్చకులు బేడా మండపంలో రామయ్యకు కల్యాణం నిర్వహించారు. భక్తులు పాల్గొని తిలకించి పునీతులయ్యారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles