చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలి..

Wed,September 11, 2019 01:59 AM

మధిర రూరల్‌, సెప్టెంబర్‌ 10: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. మంగళవారం మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో మాజీ సర్పంచ్‌, టీఆర్‌ఎస్‌ నాయకుడు వేల్పుల బుజ్జి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 34వ వర్థంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజకులకు చేయూతనిచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణనే అన్నారు. ప్రతి రజకుడు ఈ ప్రభుత్వానికి రుణపడి ఉండాలన్నారు. నాడు తెలంగాణలో ఉద్యమ వీరనారిగా పోరాటాలు నిర్వహించి ప్రజలకు అయిలమ్మ అండగా నిలిచారని తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వం అయిలమ్మ వర్థంతి, జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించేందుకు కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్‌ రంగిశెట్టి కోటేశ్వరరావు, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ శీలం వీరవెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, టీఆర్‌ఎస్‌ నాయకులు శీలం వెంకటరెడ్డి, రావూరి శ్రీనివాసరావు, తేళ్ల వాసు, కనుమూరి వెంకటేశ్వరరావు, శీలం రామ్మోహన్‌రెడ్డి, నాగార్జున, చింతల వెంకటేశ్వర్లు, అల్లూరి కృష్ణ పాల్గొన్నారు. అదేవిధంగా మండల పరిధిలోని ఖమ్మంపాడు గ్రామంలో రజకసంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్థంతి వేడుకలు నిర్వహించారు. రజకసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గడసందుల సాయిబాబు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వెంకటేశ్వర్లు, శివ, మురళీ, శ్రీను, ముత్తయ్య, రామకృష్ణ పాల్గొన్నారు.

156
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles