గొర్రెల యూనిట్ల పంపిణీ చేపట్టండి..

Wed,September 11, 2019 01:59 AM

-వినోద్‌కుమార్‌ను కలిసిన మల్లిబాబు యాదవ్‌
ఖమ్మం వ్యవసాయం, సెప్టెంబర్‌ 10: రెండో విడతకు ఎంపికైన లబ్ధిదారులకు రాయితీ గొర్రెలు పంపిణీ జరిగే విధంగా చూడాలని కోరుతూ జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌ అధ్యక్షుడు మేకల మల్లిబాబుయాదవ్‌ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ బీ వినోద్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. మంగళవారం ఆయన ఆయా జిల్లాల సంఘం నాయకులతో కలిసి హైదరాబాద్‌లో వినోద్‌కుమార్‌ క్యాంపు కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. ఇటీవల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తొలుత పుష్పగుచ్ఛాలు అందించి, శాలువతో ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన జిల్లా పెంపకందారుల పరిస్థితిని వివరించారు. తొలివిడతలో జిల్లావ్యాప్తంగా దాదాపు 1500 యునిట్లను పంపిణీ జరిగిందన్నారు. సీఎం కేసీఆర్‌ ఎంతో దూరదృష్టితో చేపట్టిన ఈ పథకంతో జిల్లావ్యాప్తంగా వేలాది కుటుంబాలకు జీవనాదారం కలిగిందన్నారు. రెండో విడతకు సంబంధించి ఎంపిక చేసిన లబ్ధిదారులకు సైతం యునిట్ల పంపిణీ జరిగితే ప్రతి పెంపకందారుడుకి ఆర్థిక భరోస కలుగుతుందని వివరించారు. తమ విజ్ఞప్తి పట్ల ప్రణాళిక సంఘం ఉపాథ్యక్షుడు సానుకూలంగా స్పందించి మరికొద్ది రోజుల్లోనే మిగిలిన వారికి సైతం యునిట్ల పంపిణీ జరిగే విధంగా చూస్తామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్‌ జిల్లా పెంపకందారుల సంఘం అధ్యక్షుడు ఓదేల్‌యాదవ్‌, సరిసిల్ల జిల్లా అధ్యక్షుడు శ్రీహరియాదవ్‌, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సదానందం కురుమ, వరంగల్‌ జిల్లా బాధ్యుడు రవీందర్‌యాదవ్‌తో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు.

161
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles