లంబోదరా..! చల్లంగ చూడు..!

Wed,September 11, 2019 02:02 AM

ఖమ్మం కల్చరల్‌ సెప్టెంబర్‌10: గణనాథుడికి విశేష పూజలు చేసి భక్త గణం తరించింది. ఈనెల 2న భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నగరంలో పలు ఉత్సవ మండపాల్లో కొలువైన గణనాథులకు ఎనిమిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేశారు. ప్రతి రోజు ప్రత్యేక పూజలు, హోమాలతో గణనాథుడిని ప్రసన్నం చేసుకున్నారు. కుంకుమ పూజలు, సరస్వతీ పూజలు, గణపతి హోమాలు, అష్టోత్తర శతనామార్చనలతో విఘ్ననాయకుడి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మంగళవారం నగరంలోని పలు మండపాల్లో ఉత్సవ కమిటీలు అన్నదానాలు, ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక భక్తి పరిమళాలను పెంచారు. నగరంలోని బైపాస్‌రోడ్‌ ఆటోనగర్‌లో ఫోర్‌ వీలర్స్‌ ఆటో టెక్నీషియన్స్‌ అసోసియేస్‌ ఏర్పాటు చేసిన కాణిపాక గణేష్‌ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి హోమాన్ని అత్యంత శాస్ర్తోక్తంగా నిర్వహించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివారెడ్డి మట్టి రథం గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. గణేష్‌ నవరాత్రి ఉత్సవాలను అత్యంత వైభవంగా, ప్రశాంతంగా నిర్వహించుకోవడం జిల్లాకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు మహంకాళి మల్లికార్జునరావు, కనకం రామకృష్ణ, విజ్జూరి వెంకటరెడ్డి, కేసగాని రవి, గన్నవరపు శ్రీనివాసరావు, అంజి, పీ భాస్కర్‌, ఆలవాల నాగేశ్వరరావు, రాజు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బొమ్మన సెంటర్‌, రమణగుట్ట ఉత్సవ మండపాల్లో గణపతిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట కార్పొరేటర్‌ తోట రామారావు, దోరేపల్లి శ్వేత, నాగేశ్వరరావు, అఫ్రోజ్‌సమీనా,టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

పలు ఉత్సవ మండపాలను సందర్శించిన స్తంభాద్రి ఉత్సవ సమితి సభ్యులు...
నగరంలోని పలు ఉత్సవ మండపాలలోని గణనాథులను స్తంభాద్రి ఉత్సవ సమితి సభ్యులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈసందర్భంగా ఉత్సవ సమితి అధ్యక్షుడు వినోద్‌ లాహోటి మాట్లాడుతూ.. బుధవారం నిర్వహించే వినాయక నిమజ్జనోత్సవాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలన్నారు. పోలీసులు నిర్దేశించిన రూట్‌ మ్యాప్‌ ప్రకారం వాహనాలు నిమజ్జనా ఘాట్‌ల వరకు తరలిరావాలని, మద్యపానం, డీజేలు నిషేధమని తెలిపారు. కార్యక్రమంలో ఉత్సవ సమితి సభ్యులు కీసర జైపాల్‌రెడ్డి, గెంటేల విద్యాసాగర్‌రావు, శ్రీహరి, అల్లిక అంజయ్య, ప్రసన్నకృష్ణ పాల్గొన్నారు.

కువైట్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో...
కువైట్‌లో టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ విభాగం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఎనిమిది రోజుల పాటు గణనాథుడికి విశేష పూజలు, హోమాలు నిర్వహించారు. జిల్లా వాసులు అభిలాష గొడిశాల, సురేష్‌, శంకర్‌రెడ్డి, రమణరాజు తదితరులు పాల్గొన్నారు.

166
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles