పారిశుధ్య పనులు పకడ్బందీగా చేపట్టాలి

Sat,September 14, 2019 12:11 AM

కొణిజర్ల : సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని 30 రోజుల గ్రామీణాభివృద్ధి కార్యాచరణ ప్రణాళిక జిల్లా ప్రత్యేకాధికారి శ్రీరామ్ సూచించారు. మండలంలోని సింగరాయపాలెంలో పలువీధుల్లో పర్యటించిన ఆయన పారిశుధ్యంపై చేపట్టిన పనులను పరిశీలించారు. రోడ్లవెంబడి చెత్తకుప్పలను తీసివేయాలని, మురుగునీరు నిల్వలు లేకుండా చూడాలని, లార్వాలను అరికట్టాలని, అంటువ్యాధులు ప్రభలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, బావులు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దొడ్డపునేని జ్యోతి, ఎంపీటీసీ అనుమోలు కృష్ణార్జునరావు, ఎంపీడీవో వీ సాయిచరణ్, ఎంఈవో శ్యాంసన్, స్థానికులు దొడ్డపునేని కృష్ణార్జునరావు, మట్టా జగన్నాధం, రావుల వెంకటనారాయణ, సెక్రటరీ రామకృష్ణ పాల్గొన్నారు.

163
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles