మంగళగూడెం సర్పంచ్ భర్తతో

Sat,September 14, 2019 12:13 AM

-ఫోన్‌లో మాట్లాడిన ట్రాన్స్‌కో సీఎండీ
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 13 : మండలంలోని మంగళగూడెం సర్పంచ్ యండపల్లి రాధిక భర్త యండపల్లి ఉపేందర్‌తో శుక్రవారం ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఫోన్‌లో మాట్లాడారు. పల్లెప్రగతి 30 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం మంగళగూడెం గ్రామంలో పవర్‌వీక్ పాటించారు. దీంతో విద్యుత్‌శాఖ సీఈ కిషన్, డీఈ క్రిష్ణ తదితరలు గ్రామాన్ని సందర్శించారు. అదే సమయలో ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు గ్రామ సర్పంచ్ భర్త ఉపేందర్‌కి ఫోన్ చేశారు. గ్రామంలో విద్యుత్ సమస్య ఎలా పరిష్కరించారు..? ఎన్ని మిడిల్ పోల్స్ ఏర్పాటు చేశారు.? విద్యుత్ సరఫరా ఎలా ఉంది అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సమాధానంతో ఉపేందర్ అధికారులు పెండింగ్ పనులు పూర్తి చేశారని, 20కి పైగా పోల్స్ ఏర్పాటు చేశారని ట్రాన్స్‌కో సీఎండీకి విరించారు. ప్రతి గ్రామంలో ఇదే తరహాలో విద్యుత్ పవర్‌వీక్‌లో పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు ట్రాన్స్‌కో సీఈ కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ రమేష్, ఏడీ ఆనంద్, ఏఈ వెంకట్, ఎంపీటీసీ సైదాబీ, ఉప సర్పంచ్ గంధం ఉపేందర్, నాయకులు వీరెల్లి నాగయ్య, బొడ్డు నర్సయ్య, సొందుమియ్యా, లాలాయ్య, రాజా, రమేష్, ఉసికెల కాటయ్య ఉన్నారు.

205
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles