ప్రజా రవాణాను మరింత మెరుగుపరుస్తాం..

Mon,September 16, 2019 12:22 AM

ఖమ్మం,నమస్తే తెలంగాణ : అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆదివారం శాసన మండలిలో సభ్యులు ప్రజా రవాణా అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ బదులిస్తూ...రాష్ట్ర రాజధానికి వివిధ పనులపై జిల్లాల నుంచి నగరానికి వస్తున్న ప్రజలకు ప్రజా రవాణా ఎంతో మెరుగు పర్చినట్లు తెలిపారు. 39 మెట్రో స్టేషన్స్ వద్ద 200 ల నుంచి 300 మీటర్ల పరిధిలోనే బస్‌షెల్టర్లు అందుబాటులో ఉన్నాయ న్నారు. అన్ని బస్‌స్టేషన్లకు అనుసంధానంగా బస్‌లు ఉన్నాయని, ఆయా బస్‌స్టేషన్ల నుంచి 40 ఎలక్ట్రిక్ బస్‌లు నగరంలోని అన్ని ప్రధాన బస్‌స్టేషన్లను కలుపుతూ విమానాశ్రయంకు తిరుగుతున్నాయని, త్వరలోనే మరో 300 ల ఎలక్ట్రిక్ బస్‌లను ఫ్రేమ్-2 స్కీం క్రింద ప్రవేశపెట్టబోతున్నామన్నారు. ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచే ఆలోచనలలో భాగంగా ప్రస్తుతమున్న మూడు కారిడార్‌లలోని అన్ని మెట్రో స్టేషన్ల నుంచి ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా మెట్రోకు అనుసంధానంగా ఎలక్ట్రిక్ బస్‌లను త్వరలోనే ఏర్పాటు చేస్తామ న్నారు. ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ ద్వారా మెరుగైన రవాణా సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తుందని ఈ సందర్భంగా సభకు వివరించారు.

134
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles