గడ్డపు సొగసు చూడ తరమా!

Mon,September 16, 2019 12:23 AM

ముఖం నిండైన గడ్డం... ఓ వైపు సగం... మరో వైపు నిండుగా... మీసాల నుంచి గడ్డం దాకా నిగనిగలు.. ఖమ్మం బియర్డ్ షో నగరవాసులకు కొత్త సొగసును చూపించింది. కర్ల్స్ అండ్ కట్స్, ఖమ్మం బియర్డ్ షో ఆధ్వర్యంలో నగ రంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఆదివారం రాత్రి గడ్డపు అందాలతో పాటు యువతుల ర్యాంప్ వాక్‌లతో అలరించింది.రకరకాల గడ్డాలతో పలువురు యువకులు ర్యాం ప్‌పై తమ గడ్డాల సొబగును ప్రదర్శించారు. అదేవిధంగా పలువురు యువతులు, చిన్నారులు ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసి నడకకే అందాలు నేర్పారు. సంప్రదాయ, ఆధునిక వస్త్రధారణలో యువతులు వ య్యారిభామలై తమ అందచందాలను హొయలొ లికిస్తూ ఆహుతులను కనువిందు చేశారు. ఈసంద ర్భంగా బియర్డ్ క్లబ్ వ్యవస్థాపకుడు రూపేష్ నాయక్ మాట్లాడుతూ పలు దేశాలు, రాష్ర్టాలలో గల ఈ తరహా క్లబ్ యువకులకు నూతన ట్రెం డ్‌ను సృష్టిస్తోందని, పలు రకాల ైస్టెలిష్ గడ్డాలతో యువకుల అందాలు మరింత ప్రస్పుటమవుతాయన్నారు. బుల్లి తెర యాం కర్ స్వప్న తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంది. కార్యక్రమంలో కర్ల్స్ అండ్ కట్స్ రమేష్ కొంగర, బియర్డ్ క్లబ్ వ్యవస్థాపకుడు రూపేష్ నాయక్, ఖమ్మం బియర్డ్ క్లబ్ ఇన్‌చార్జ్ వంశీ, రాష్ట్ర బియర్డ్ క్లబ్ బాధ్యుడు బాలాజీ, చరణ్, పవన్ పాల్గొన్నారు. -ఖమ్మం కల్చరల్

181
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles