మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మంత్రి అజయ్,ఎంపీ శుభాకాంక్షలు

Mon,September 16, 2019 12:24 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదివారం శాసన మండలిలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రజా సమస్యల పరిష్కారాని శాసన మండలి వేదిక ద్వారా పరిష్కరిస్తానన్నారు.

నామా అభినందనలు..
శాసన మండలి నూతన చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఆదివారం హైదాబాద్‌లో టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్ష నాయకులు నామా నాగేశ్వరరావు, పెద్దపల్లి టీఆర్‌ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు గుత్తా సుఖేందర్‌రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పరిశ్రమల శాఖ పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌గా నియమితులైన టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత డాక్టర్ కే కేశవరావును కూడా మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles