ఆశలు జలసమాధి..

Wed,September 18, 2019 12:35 AM

లండన్ బీచ్‌లో లభ్యమైన మృతదేహం శ్రీహర్షదే.. లాంచీ ప్రమాదంలో విష్ణుకుమార్ మృతదేహం లభ్యం
లండన్‌లో ఉన్నత చదువులు చదివి కొడుకు తిరిగివస్తాడని ఎదురుచూసిన శ్రీహర్ష తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. గోదావరి లాంచీ ప్రమాదంలో చిక్కుకున్న కొడుకు క్షేమంగా వస్తాడని కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూసిన ఆ తల్లికి చేదు వార్త అందింది. లండన్‌లో శ్రీహర్ష అదృశ్యం, గోదావరి లాంచీ ప్రమాదం ఆయా కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని మిగిల్చాయి. వేర్వేరు చోట్ల జరిగిన సంఘటనల్లో మంగళవారం ఇద్దరి మృతదేహాలు గుర్తించడంతో కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. తల్లిదండ్రుల ఆశలు జలసమాధి అయ్యాయి..

శోకసంద్రంలో విష్ణుకుమార్ కుటుంబం..
నేలకొండపల్లి: పాపికొండల పర్యటన ఆ కు టుంబంలో తీరని విషాదాన్ని నిం పింది. తన స్నేహితులతో కలిసి ఆనందంగా వెళ్లిన కొడుకు విష్ణుకుమార్ విగత జీవిగా మారి ఇంటికి వస్తాడని ఊహించలేకపోయారు. కొడుకు తిరిగి వస్తాడని కళ్లల్లో ఒత్తులేసుకొని ఎదురుచూసిన ఆ తల్లిదండ్రుల ఆశ లు ఆవిరయ్యాయి. భర్త క్షేమం గానే ఉంటాడని.. తిరిగి వస్తాడని భావించిన భార్య ఆశలు జలసమాధి అయ్యా యి. నేలకొండపల్లికి చెందిన విష్ణుకుమార్ మృతదేహాన్ని మంగళవారం మధ్యాహ్నం రాజమండ్రి ఆస్పత్రిలో గుర్తించారు. అతను చనిపోయాడన్న విషయం తెలియ డంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటినాయి. రాజమండ్రి నుంచి ఆదివారం పాపికొండ లకు బయలుదేరిన లాంచీ గోదావరిలో మునిగిపోయిన సంఘటనలో నేలకొండ పల్లికి చెందిన రేపాకుల విష్ణుకుమార్(33) ఉన్నాడు. రెండు రోజులుగా ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టగా మంగళవారం ఉదయం పలువురి శవాలు గోదావరిలో లభించడంతో వాటిని రాజమండ్రి ఆస్పత్రికి తర లించారు. అధికారుల సమాచారం మేరకు విష్ణుకుమార్ తండ్రి సూరయ్య, కుటుంబ సభ్యులు రాజమండ్రి ఆస్పతికి వెళ్లి శవాలను పరిశీలించి అందులో విష్ణుకుమార్ కూడా ఉన్నట్లు గుర్తించారు. రెండు రోజులుగా అతని మృతదేహం నీటిలో ఉండటంతో ఉబ్బిపోయింది. నేలకొండపల్లిలోవిషాదఛాయలు అలుముకున్నాయి. విష్ణుకుమార్ ఇకలేడు అన్న విషయం తెలియ డంతో కు టుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యాంతమయ్యారు. మృతదేహాన్ని రాత్రికి గాని, బుధవారం ఉదయానికి గాని నేలకొండపల్లికి తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి.

రేపు ఖమ్మానికి రానున్న శ్రీహర్ష మృతదేహం డీఎన్‌ఏ టెస్టు అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించిన లండన్ పోలీసులు
మయూరి సెంటర్: భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు సన్నె ఉదయ్‌ప్రతాప్ కొడుకు ఉజ్వల్ శ్రీహర్ష లండన్‌లోని ఓ బీచ్ వద్ద గత నెల 21వ తేదీన అదృశ్యమైన ఘటన విదితమే. ఈ నెల 3వ తేదీన లండన్ బీచ్ వద్ద అక్కడి పోలీసులకు ఒక అనుమానాస్పద మృతదేహం లభ్యంకావడంతో డీఎన్‌ఏ పరీక్షల నిర్వహించిన అనంతరం శ్రీహర్షదిగా అక్కడి పోలీసులు నిర్దారించారు. మంగళవా రం శ్రీహర్ష తండ్రి ఉదయ్ ప్రతాప్ నమస్తే తెలంగాణకు ఫోన్ ద్వారా వివరాలు తెలిపారు. ఆగస్టు 21వ తేదీన శ్రీహర్ష లండన్‌లోని ఓ బీచ్ వ ద్ద అదృశ్యం కావడం తో లండన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి తమకు సమాచారం అందిం చడంతో గత నెల 26వ తేదీన తాను లండన్‌కు వెళ్లడం జరిగిందని తెలిపారు. శ్రీహర్ష హైద్రాబాద్ బిట్స్‌పిలానీలో బీటెక్‌ను పూర్తి చేసి లండన్‌లోని క్వీన్స్ యూనివర్సిటీలో పీజీ చదివేందుకు వెళ్లాడని తెలి పారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ద్వారా భారత ప్రభుత్వ సహకారంతో లండన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి తన కుమారుడి మృత దేహాన్ని నిర్దారించారని పేర్కొన్నారు. శ్రీహర్ష తెలివిగల వాడని, లండన్ యూని వర్సిటీ నుంచి ఓ ప్రాజెక్టు పనిపై కోఆర్థర్ (రచయిత)గా జపాన్ దేశంలోని యూనివర్సిటీకి ప్రాజెక్టును పూర్తిచేశారని తెలిపారు. మృతికి కారణాలు ఏవైనా తెలియరాలేదని లండన్ పోలీసులు విచారణ జరుపుతున్నామని వివరించారు. ఈ నెల 18వ తేదీ రా త్రి మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారని, 19వ తేదీ మధ్యాహ్న ఖమ్మానికి తీసుకురానున్నట్లు ఆయన వివరించారు. 19వ తేదీన అంత్యక్రియలు ఖమ్మంలో జరగనున్నాయి.

173
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles