ఎల్‌టీఆర్ కేసులు పరిష్కరించాలి : ఐటీడీఏ పీవో

Thu,September 19, 2019 12:53 AM

మామిళ్లగూడెం, సెప్టెంబర్ 18: ఏజన్సీ ప్రాంతంలో అపరిష్కృతంగా ఉన్న ఎల్‌టీఆర్ కేసులను వెంటనే పరిష్కరించాలని ఐటీడీఏ పీవో గౌతమ్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన పీవో నగరంలో టీటీడీసీ భవనంలో ఎల్‌టీఆర్ కేసులపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఏజన్సీ ప్రాంతంలో ఉన్న స్థానిక గిరిజనలకు మాత్రమే భూమిపై హక్కులు ఉన్నాయని ఎవరైనా గిరిజనేతరులు ఆక్రమించుకుంటే వాటిని వెంటనే గుర్తించి ఆ భూములను స్థానిక గిరిజనులకు అప్పగించాలన్నారు. ఈ విషయంలో గిరిజనేతరులు వినకపోతే వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. ఇప్పటికే ఎవరికైనా గిరిజనులకు కోర్టు ఆదేశాలు ఉంటే పంచనామా చేసి ప్రతిపాదనలు పంపించాలన్నారు.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles