వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహ పనుల పరిశీలన

Thu,September 19, 2019 12:53 AM

జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీడీఏ పీవో గౌతమ్ నగరంలో నయాబజార్ కళాశాల ఎదురుగా రూ.2.30 కోట్లతో నిర్మాణం చేస్తున్న వర్కింగ్ ఉమెన్స్ వసతి గృహాన్ని సందర్శించారు. పనులు ఆలస్యం కావడం పట్ల గుత్తేదారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణం చేస్తున్న మూడు ఫ్లోరులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకరావాలన్నారు. పూర్తిస్థాయి పనులను 15 రోజుల్లో పూర్తి చేయాలని గుత్తేదారును ఆదేశించారు. నాణ్యత ప్రమాణాల తనిఖీలో ఇంజనీరింగ్ అధికారులను మందలించారు. భవన నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసేందుకు పర్యవేక్షించాలని జిల్లా ఇన్‌చార్జీ డీటీడీవో జీ.అశోక్‌ను ఆదేశించారు. పనుల పరిశీలన కార్యక్రమంలో జేసీ అనురాగ్‌జయంతి, ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్‌సురభి, కల్లూరు ఆర్డీవో శివాజీ, డీఈ మురళీ, ఏఈ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

130
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles