చెరువులో పడి వ్యక్తి గల్లంతు

Thu,September 19, 2019 12:54 AM

ముదిగొండ, సెప్టెంబర్ 18 : చెరువులో పడి వ్యక్తి గల్లంతైన సంఘటన మండలంలోని గంధసిరి గ్రామాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గంధసిరి గ్రామానికి చెందిన ఓరుగంటి గురుపాదం (53) నర్సాపురం ఊర చెరువు సొసైటీలో సభ్యుడిగా ఉన్నాడు. మంగళవారం సాయంత్రం సమయంలో ప్రభుత్వం ఇచ్చిన ఉచిత చేప పిల్లలను చెరువులో వదిలేందుకు సొసైటీ సభ్యులతో కలిసి వెళ్లాడు. చెరువుకు ఇంకో వైపు ఉన్న తూముకు వల కట్టేందుకు ఒక్కడే ద్విచక్ర వాహనంపై వెళ్లాడు. ఆ తరువాత ఎంతసేపటికీ గురుపాదం రాకపోవడంతో కుటుంబ సభ్యులు విచారించగా తూముకు వల కట్టడానికి వెల్లాడని చెప్పడంతో వెళ్లి చూడగా బట్టలు, వాచీ బండిపై ఉన్నాయి. చెప్పులు నీటిపై తేలుతూ కనిపించాయి. దీంతో గ్రామస్తులు చెరువులోకి దిగి వెతికినా కన్పించలేదు. విషయం తెలుసుకున్న ముదిగొండ ఎస్ మహేశ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

132
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles