పరిశుభ్రతను పాటించండి..

Thu,September 19, 2019 12:54 AM

-ఐటీడీఏ పీవో, జడ్పీ సీఈవో, అసిస్టెంట్ కలెక్టర్
కారేపల్లి రూరల్, సెప్టెంబర్18: పరిసరాల పరిశుభ్రతను తప్పకుండా పాటించాలని అధికారులు సూచించారు. సింగరేణి మండలంలోని కొమ్ముగూడెం, ముత్యాలగూడెం గ్రామాల్లో బుధవారం ఐటీడీఏ పీవో గౌతమ్, జడ్పీ సీఈవో సీహెచ్ ప్రియాంక, ఖమ్మం అసిస్టెంట్ కలెక్టర్ హనుమంతు కొడింబాలు పర్యటించారు. గ్రామాల్లో ప్రతి వీధి తిరిగి పరిశీలించారు. మరుగుదొడ్ల, ఇంకుడుగుంతల వినియోగం గురించి గ్రామస్తులను అడిగారు. కొందరి ఇండ్లల్లో నీరు నిల్వ ఉండటంతో స్వయంగా ఆ నీటిని తొలగించారు. ప్రతిరోజు వైద్యసిబ్బంది వస్తున్నారా.. సలహాలు ఇస్తున్నారా.. అని గ్రామస్తులను ప్రశ్నించారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles