అనాథ మృతదేహానికి అంత్యక్రియలు

Thu,September 19, 2019 11:38 PM

కామేపల్లి/ఖమ్మం: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ అనాథ వ్యక్తి మృతిచెందాడు. కామేపల్లి మర్రిగూడెం గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున రహదారిపైన నడుచుకుంటూ వెళ్తున్న ఓ అనాథ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వ్యక్తి తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహన్ని ఖమ్మం అన్నం ఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావు అంబులెన్స్‌లో పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం దవాఖానాకు తరలించి, అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఫౌండేషన్ సభ్యులు ఉపేందర్, ఈశ్వరమ్మ, సరస్వతి, ఉమా, నాగుల్‌మీరా, నాగేశ్వరరావు, రాఘవయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

136
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles