గల్లంతైన మత్స్యకారుడి మృతదేహం లభ్యం

Thu,September 19, 2019 11:38 PM

ముదిగొండ: మండలంలోని గంధసిరి గ్రామంలోగల చెరువులో రెండు రోజుల క్రితం చేపల వల కట్టేందుకు వెళ్లి, నీటిలో పడిపోయి గల్లంతైన అదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు ఓరుగంటి గురుపాదం(53) మృతిచెందాడు. మృతదేహం గురువారం లభ్యమైంది. ఈ చెరువుకు ఈ నెల 17న ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేసింది. ఈ చేప పిల్లలను చెరువులో పోయడానికి ముందే, పక్కనే ఉన్న తూముకు వల కట్టేందుకు గురుపాదం వెళ్లి గల్లంతయ్యాడు. చెరువు కట్టపై ద్విచక్ర వాహనం, దుస్తులు, వాచీ ఉన్నాయి. చెరువులో చెప్పులు తేలుతూ కనిపించాయి. దీంతో, మత్స్యకారులు చెరువులో గాలించినా ఆచూకీ దొరకలేదు. అతడి కుటుంబీకులు ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ చెరువులో మృతదేహం గురువారం చెరువులో పైకి తేలింది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. కేసును ఎస్‌ఐ మహేష్ నమోదు చేశారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles