రోగులకు మెరుగైన సేవలందించండి

Thu,September 19, 2019 11:40 PM

-24గంటల్లో రక్తపరీక్షల రిపోర్టులు తెలపాలి
-ఎంసీహెచ్‌లో ఎలీసా పరికరాన్ని వినియోగంలోకి తీసుకోండి
-కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్
-ట్రామా కేర్‌లో నూతన ఏర్పాట్ల పరిశీలన
-వైద్యులకు పలు సలహాలు, సూచనలు..

మయూరిసెంటర్: ఖమ్మం ప్రభుత్వ ప్రధానాసుపత్రికి జ్వర పీడితుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ట్రామాకేర్ సెంటర్‌లో అదనపు పడకలు వేసి వైద్య సేవలు అందిస్తున్నారు. గురువారం కలెక్టర్ కర్ణన్,సీఈవో ప్రియాంక ఏర్పాట్లను పరిశీలించారు.తొలుత కలెక్టర్ నూతనంగా ఏర్పాటు చేసిన 50 పడకలు, అందులో జ్వర పీడితులకు అందు తున్న సేవలను ఆయన పరిశీలించారు. అనంతరం పాత భవనంలో ఫీవర్ జనరల్ వార్డులను సందర్శించి అక్కడ రోగులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారని,ఏ గ్రామం నుంచి వచ్చా రని వివరాలు అడిగారు. అనంతరం ల్యాబ్ , బ్లడ్ బ్యాంక్‌ను సందర్శించి అక్కడ ఉన్న ల్యాబ్ టెక్నీషియన్లను ప్రశ్నించారు. ఎలీసా పరికరం ద్వారా రోజుకు ఎన్ని టెస్టులను నిర్వహిస్తున్నారని, ఎన్ని రిపోర్టులను జ్వర పీడితులకు అందజేస్తున్నారని అడిగారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఒక ఎలీసా పరికరాన్ని ల్యాబ్‌కు తెప్పించుకుని డెంగ్యూ నిర్దారణ కోసం సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

టీబీ వార్డులో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ల సహకారంతో జ్వర పీడితులకు విశేష సేవలు అందించాలని ఆర్‌ఎంవోను ఆదేశించారు. ప్రతి రోజు సుమారు 300ల బ్లడ్ షాం పిల్స్‌ను తీసుకుని ఏ రోజుకు ఆ రోజు రిపోర్టులను బాధితులకు అందించాలని, ఆ రిపోర్టు వివరాలను తన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రామునాయక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి, ఆర్‌ఎంవో డాక్టర్ కృపాఉషాశ్రీ, డీఎంవో డాక్టర్ సైదులు, వైద్యులు డాక్టర్ బీఎస్ రావు, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ సురేష్, నర్సింగ్ సూపరింటెండెంట్ సుగుణ, మేరి, సిబ్బంది పాల్గొన్నారు.

166
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles