ఫైలేరియా బాధితులందరికీ పింఛన్ ఇవ్వాలి

Fri,September 20, 2019 11:23 PM

-జీవో అవర్‌లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రస్తావన
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 20 : గ్రేడ్-2,గ్రేడ్-3 ఫైలేరియా బాధితులకే కాకుండా ఫైలేరియా ఉన్నవారందరికీ ఫించన్ అందించాలని శుక్రవారం అసెంబ్లీ సమావేశంలో జీరో అవర్‌లో ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ప్రస్తావించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3308మంది ఫైలేరియా బాధితులు ఉంటే ఒక్క పాలేరు నియోజకవర్గంలోనే 1650మంది ఉన్నారని తెలిపారు. ఇంతకు ముందు ఎవరు చేయని విధంగా సీఎం కేసీఆర్ ఫైలేరియా బాధితులకు పింఛన్ అందివ్వడం గొప్ప విషయం అన్నారు. డీఎసీ టాబ్లెట్లను జిల్లా కేంద్రంలోనే కాకుండా పీహెచ్‌సీలో లభించే విధంగా కృషి చేయాలన్నారు. ఫైలేరియాబాధితులు పాలేరు నియోజకవర్గంలోని తిరుమాలయపాలెం మండలంలో అధికంగా ఉన్నారని, ఈవ్యాధిని గుర్తించే ఫైలేరియా సెంటర్‌ను ఏర్పాటు చేయాలని వైద్యశాఖ మంత్రికి విన్నవించారు.

135
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles