వైరా, జూలూరుపాడుల్లో 30 పడకల ఆసుపత్రులు నిర్మించాలి..

Fri,September 20, 2019 11:23 PM

వైరా నమస్తేతెలంగాణ, సెప్టెంబర్20: వైరా నియోజకవర్గంలో అత్యధిక శాతం గిరిజనులు నివసించే జూలురుపాడుతో పాటు నియోజకవర్గ కేంద్రమైన వైరాలో ప్రభుత్వం 30 పడకల ఆసుపత్రులను నిర్మించి వైద్య సేవలు విస్తరింప చేయాలని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే రాములునాయక్ ఈ విషయాన్ని కోరారు. వైరాలో, జూలూరుపాడులో ఉన్న పీహెచ్‌సీలను 30 పడకల ఆసుపత్రిలుగా అప్‌గ్రేడ్ చేసి గిరిజన, ఇతర వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వైరాలో అసంపూర్తిగా నిర్మించిన ఇండోర్ స్టేడియానికి నిధులు మంజూరు చేయాలని, నియోజకవర్గంలో క్రీడాకారుల కోసం మిని స్టేడియం మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా వైరాకు మున్సిపల్ కమినర్‌ను నియమించాలని, డంపింగ్ యార్డుకు స్థలం మంజూరు చేయాలని కోరారు. స్పందించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. జూలూరుపాడులో పీహెచ్‌సీని 30 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసేందుకు, వైరాలో అసంపూర్తిగా నిర్మించిన ఇండోర్ స్టేడియానికి నిధులు మంజూరు చేసేందుకు, మినిస్టేడియం మంజూరుకు, డంపింగ్ యార్డు ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైరా మున్సిపాలిటీకు వెంటనే కమిషనర్‌ను నియమిస్తామని స్పష్టంచేశారు.

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles