శిఖం భూమిలో డంపింగ్‌యార్డు వద్దు : కలెక్టర్

Fri,September 20, 2019 11:23 PM

తల్లాడ, సెప్టెంబర్20: శిఖం భూమిలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేయొద్దని కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశించారు. శుక్రవారం తల్లాడలో ఎదుళ్లచెరువు పక్కన డంపింగ్ యార్డు కోసం చూపించిన స్థలాన్ని జడ్పీ సీఈవో ప్రియాంకతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చెరువు పక్కనే డంపింగ్ యార్డు ఏర్పాటు చేయడం ద్వారా చెరువులో నీళ్లు కలుషితమవడంతో పాటు, వ్యవసాయ భూములు పాడైపోతాయన్నారు. స్థానిక అధికారులు చెరువు పక్కనే 20 కుంటల స్థలాన్ని డంపింగ్‌యార్డు కోసం ఏర్పాటు చేశారు.

ఇప్పటి వరకు కల్లూరు రోడ్డులో రాష్ట్రీయ రహదారి పక్కనే చెత్తాచెదారం వేయడంతో దుర్ఘంధం వెదజల్లుతూ ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి లేకపోతే భూమిని కొనుగోలు చేసైనా డంపింగ్‌యార్డును ఏర్పాటు చేసుకోవాలని సర్పంచ్ కొట్టేటి సంధ్యారాణిని ఆదేశించారు. 30 రోజుల ప్రణాళికకు సంబంధించిన సమాచారాన్ని ఎంపీడీవో జీ.శ్రీదేవిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో ముమ్మరంగా పారిశుధ్య కార్యక్రమాలు, మొక్కలు నాటడం, శ్మశానవాటికల ఏర్పాటు, డంపింగ్‌యార్డుల ఏర్పాటు వంటి విషయాల్లో సీరియస్‌గా తీసుకొని పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ డీఎస్ వెంకన్న, ఎంపీడీవో కొండపల్లి శ్రీదేవి, పంచాయతీ స్పెషల్‌ఆఫీసర్లు, డిప్యూటీ తహసీల్దార్ కృష్ణ, ఉపసర్పంచ్ గుండ్ల వెంకటేశ్వర్లు, వీడీసీ చైర్మన్ దగ్గుల శ్రీనివాసరెడ్డి, కొట్టేటి జనార్దన్‌రెడ్డి, ఆర్‌ఐలు, వీఆర్వోలు ఉన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles