రామున్ని దర్శించుకున్న జెన్కో, ట్రాన్స్‌కో సీఎండీ..

Fri,September 20, 2019 11:24 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారిని టీఎస్ జెన్కో అండ్ టీఎస్ ట్రాన్స్‌కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ దేవేలుపల్లి ప్రభాకర్‌రావు శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభాకర్‌రావు గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియంను సందర్శించి సీతమ్మవారి నగలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఆలయ విశిష్టత గురించి అర్చకులు సీఎండీకి వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

162
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles