విజయ డెయిరీ సొసైటీ చైర్మన్‌గా బోజెడ్ల వెంకటయ్య

Fri,September 20, 2019 11:24 PM

-సన్మానించిన రూరల్ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్
ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, సెప్టెంబర్ 20 : జిల్లా విజయడెయిరీ సొసైటీ చైర్మన్‌గా రూరల్ మండలం మంగళగూడెం గ్రామానికి చెందిన బోజెడ్ల వెంకటయ్య నియమితులయ్యారు. శుక్రవారం విజయడెయిరీ కార్యాలయంలో నూతన చైర్మన్ వెంకటయ్యను రూరల్ జడ్పీటీసీ యండపల్లి వరప్రసాద్ శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత 40 సంవత్సరాలుగా మా గ్రామంలో విజయ డెయిరీకి సేవలు చేస్తున్న బోజెడ్ల వెంకటయ్యకు చైర్మన్ పదవీ ఇవ్వడం శుభ పరిణామం అన్నారు. గ్రామంలో సొసైటీని ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేసిన ఘనత వెంకటయ్యకే దక్కిందన్నారు. నూతన చైర్మన్ బోజెడ్ల మాట్లాడుతూ.. నా మీద నమ్మకం ఉంచి నాకు అవకాశాన్ని కల్పించిన రైతులకు సద్వినియోగపడే విధంగా కృషి చేస్తానని తెలిపారు. సంఘం బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ యండపల్లి రవి, వీరెల్లీ నాగయ్య, ఉపేందర్, సోందుమియ్యా, బోడ్డు నర్సయ్య, సంఘ సభ్యులు ఉన్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles