జిల్లాకు 10 వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలి

Sun,September 22, 2019 03:06 AM

-వ్యవసాయ మంత్రిని కోరిన ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం,నమస్తే తెలంగాణ :ఖమ్మం జిల్లా కు నాలుగు వారాలకు సరిపడేలా 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేయాలని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని టీఆర్‌ఎస్ లోక్‌సభ పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కోరారు. దీనిపై వ్యవసాయశాఖ మంత్రి సాను కూలంగా స్పందించారు. ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారి (జేడీ) ఝాన్సీ లక్ష్మీకుమారి జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం పెరిగిన దృష్ట్యా యూరియా సరఫరాను పెంచాలని ఎంపీ నామా నాగేశ్వరరావుని కోరారు. దీంతో తక్షణమే స్పందించిన ఎంపీ నామా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని ఖమ్మం జిల్లాకు యూరియా సరఫరా పెంచాలని కోరారు. నాలుగు వారాలకు సరిపోయేలా 10వేల మెట్రిక్ టన్నుల యూరియాను ఖమ్మం జిల్లాకు సరఫరా చేయాలని ఎంపీ నామా మంత్రిని కోరారు. ఖమ్మం జిల్లాలో రైతులు ఈ ఏడాది 2,04,711 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురిస్తుండటం, గోదావరి నదితో పాటు ఇతర రిజర్వాయర్లలో పుష్కలంగా నీరుండటంతో జిల్లాలో పంటలసాగు గణనీయంగా పెరుగుతోందని, అందువల్ల జిల్లాలో యూరియా అవసరం ఉందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి ఖమ్మం జిల్లాకు సరిపడా యూరియాను సరఫరా చేస్తామని ఎంపీ నామకు హామినిచ్చారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles