ప్లాస్టిక్ నిషేధం ఉద్యమంలా జరగాలి

Sun,September 22, 2019 03:08 AM

-శ్రీచైతన్య అవగాహన సదస్సులో ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్‌సురభి
ఖమ్మం ఎడ్యుకేషన్: పర్యావరణం పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం ఉద్యమంలా జరగాలని ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. శనివారం శ్రీచైతన్య విద్యా సంస్థలో ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్లాస్టిక్ వినియోగం వలన కలిగే నష్టాలను వివరించారు. ప్లాస్టిక్ సంచుల వలన కాలువలు మూసుకుపోవడం భూ గర్భజలాల కాలుష్యం మొదలైన వాటితో పాటు విచక్షణా రహితంగా ఉపయోగించే రసాయనాల వలన పర్యావరణ సమస్యలు కలుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవిబాబు, మున్సి పల్ కమిషనర్ శ్రీనివాసరావు, వరలక్ష్మి, హారిత, ప్రభావతి, శ్రీచైతన్య విద్యాసంస్థల డైరక్టర్ మ ల్లెంపాటి శ్రీవిద్య, అకడమిక్ డైరక్టర్ మల్లెంపాటి సాయిగీతిక, డీజీఎం సత్యనారాయణ, డీన్ వర్మ, ఏజీఎంలు చిట్టూరి బ్రహ్మం, జి ప్రకాష్, గోపాలకృష్ణ పాల్గొన్నారు.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles