ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి

Sun,September 22, 2019 03:08 AM

మధిర, నమస్తేతెలంగాణ:సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు పేర్కొన్నారు. శనివారం స్థానిక ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆయన పా ల్గొని చిన్నారులకు వ్యాక్సిన్‌ను వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించాలని తెలిపారు. రోటావైరస్ వ్యాక్సిన్ ద్వారా చిన్నారు ల్లో వచ్చే పలురకాల వ్యాధులకు గురికాకుండా నివారించవచ్చన్నారు. ప్రజలు వైద్యుల సలహాలు, సూచనల మేరకు వైద్యపరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రతీఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, తహసీల్దార్ ఫూల్‌సింగ్, ప్రభుత్వ ఆసు పత్రి సూపరిండెంట్ డాక్టర్ శ్రావణ్‌కుమార్, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవిశెట్టి రంగారావు, మండల కార్యదర్శి చిత్తారు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, శీలం వెంక టరెడ్డి, వెలగపుడి శివరాంప్రసాద్, కనుమూరి వెంకటేశ్వరరావు, ములకపల్లి వినయ్‌కుమార్, తాండ్ర తిరుమలరావు, యర్రంశెట్టి వెంకటఅప్పారావు, చావా వేణు, యర్రగుంట రమేష్, వేముల శ్రీను, నాగులవంచ రామారావు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles