పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవాలి

Sun,September 22, 2019 03:08 AM

ప్రతిఒక్కరు పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతారని జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు పేర్కొన్నారు. శనివారం మధిర పట్టణంలోని ఎంప్లాయీస్‌కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఇంటింటా పోషణ సంబరాల్లో భాగంగా పోషణ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మెండెం లలిత, పాఠశాల హెచ్‌ఎం శంశుద్దీన్, సీడీపీవో శారద, తదితరులు పాల్గొన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles