ఆరునెలలకొకసారి నియోజకవర్గంలో సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలి

Sun,September 22, 2019 03:14 AM

-సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సత్తుపల్లి, నమస్తే తెలంగాణ: జిల్లా కేంద్రంలో సదరం క్యాంపులు నిర్వహించడంతో దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారని, పైరవీకారులు, పలుకుపడి ఉన్న వారికి మాత్రమే జిల్లా కేంద్ర ఆసుపత్రిలో పనులు జరుగు తు న్నాయని, ప్రతీ ఆరునెలలకొకసారి నియోజకవర్గ కేంద్రాల్లో సదరం క్యాంపులు ఏర్పాటు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అసెంబ్లీలో తన వాణి వినిపించారు. ప్రధానంగా ఒంటరి మహిళల పింఛన్ల విషయంలో తహసీల్దార్, ఎంపీడీవోలు ఎవరు నిర్ధారించేది అర్థంకావడంలేదని, ప్రభుత్వం పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వాలని, నూతనంగా పింఛన్ల కోసం అర్జీ చేసుకున్న వితంతువుల దర ఖాస్తులను ఏడాదిగా పెండింగ్‌లో ఉంచారని పేర్కొన్నారు. పింఛన్లు పొందుతున్న వృద్ధులు, దివ్యాంగుల వేలిముద్రల విషయంలో సిగ్నల్స్, వేలిముద్రలు అరిగి పోవడం కారణంగా పలువురికి వస్తున్న పింఛను నిలిచిపోతుందనిన్నారు. ప్రభుత్వం కుదించిన 57 ఏళ్ల వయస్సు కలిగిన వారందరికీ పింఛన్లు దరఖాస్తు చేసుకునే వీలు కల్పించి వెంటనే వారికి వాటిని అందజేయాలని మంత్రికి విన్నవించారు. ప్రధా నంగా సదరం క్యాంపులను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి అర్హులందరికీ ధ్రువీకరణ పత్రాలు అందించేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఆయన మంత్రిని కోరారు.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles