జాతీయ స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు

Sun,September 22, 2019 03:14 AM

-జిల్లా ప్రదర్శనలు ఎంపిక
ఖమ్మం ఎడ్యుకేషన్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయపూర్‌లో అక్టోబర్ 15 నుంచి 20వ తేది వరకు జరిగే జాతీయ స్థాయి సైన్స్ ఫేర్‌కు తెలంగాణ రాష్ట్రం నుంచి 9 ఎగ్జిబిట్‌లు ఎంపిక కాగా అందులో రెండు ఎగ్జిబిట్‌లు ఖ మ్మం నుంచి ఎంపికయ్యాయి. జడ్పీఎస్‌ఎస్ ఏన్కూర్, జడ్పీఎస్‌ఎస్ వీఎం బంజర నుంచి ప్రాజెక్ట్‌లు అర్హత సాధించాయి. జడ్పీహెచ్‌ఎస్ ఏన్కూర్ విద్యార్థులు ప్రవళిక, గీతలు ప్రదర్శించిన క్లాత్స్ డ్రై ఇన్ సన్‌షైన్ హైడ్ ఇట్ రైన్ అను ప్రదర్శన ఎంపికైంది. దీనికి గైడ్ టీచర్‌గా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు సుజాత వ్యవహరించారు. జడ్పీహెచ్‌ఎస్ వీఎం బంజర విద్యార్థులు చందనప్రియ, మద్దెయ్యలు ప్రదర్శించిన ప్రీవెంటింగ్ ఫైర్ ఆక్సిడెంట్స్ ఇన్ ట్రైన్స్ యూజింగ్ టెక్నాలజీస్ అను ప్రదర్శన ఎంపికైంది. గైడ్ టీచర్‌గా పొట్ట రామారావు వ్యవహరించారు.జాతీయ స్ధాయికి ఎంపికైన విద్యార్ధులను జిల్లా విద్యాశాఖాధికారి పీ మదన్‌మోహన్, డీఎస్‌ఓ సైదులులు అభినందించారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles