ప్రేమజంట ఆత్మహత్య

Sun,September 22, 2019 03:17 AM

-ఒకే కుటుంబంలో మరో అమ్మాయిని ఇచ్చేందుకు ఇష్టపడని తల్లిదండ్రులు
-పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని మనస్తాపంతో బలవర్మరణం
-జూలూరుపాడు మండలంలో ఘటన

జూలూరుపాడు:వాళ్లిద్దరూ మూడేళ్లగా ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకు న్నారు..ఇరుకుటుంబాలకు విషయా న్ని చెప్పి పెద్దల స మక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు..విషయాన్ని ఇరువురు వారి ఇళ్లలో తెలపడంతో అ బ్బాయి తల్లిదండ్రులు అ భ్యంతరం తెలపలేదు. ప్రేమికుడు అన్న,ప్రియురాలి అక్క ఇద్దరూ ప్రే మించి పెళ్లి చేసుకున్నారు.తిరిగి అదే కుటుంబంలో తమ్ముడికి మరో అమ్మాయిని ఇచ్చేందుకు అమ్మాయి తల్లి దండ్రులు ఇష్టపడలేదు.వారం రోజుల పాటు ఇరు కుటుంబాల మధ్య చర్చలు కొనసాగాయి.ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడి కొంత సమ యం తీసుకొని ఆలోచించి పెళ్లి చేస్తామని అమ్మాయి తల్లిదండ్రులు తెలపడంతో వారు స్పష్టమైన హామీ ఇవ్వడం లేదని పెళ్లి చేస్తారో లేదో అనే అనుమానంతో మనస్తాపం చెందిన ప్రేమికులు పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.గ్రామస్తులు,కటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..మండల పరిధిలోని అన్నారుపాడు గ్రామానికి చెందిన లావుడ్యా లక్ష్మణ్-మోతి దంపతులకు ము గ్గురు కుమార్తెలు వీరిలో చిన్న కుమార్తె లావుడ్యా సింధు(22) అదే గ్రామానికి చెందిన గుగులోతు శ్రీను-లక్ష్మి దంపతుల చిన్నకుమారుడు గుగులోతు గోపి అలియాస్ పండు(24)గత మూడేళ్లగా ప్రేమించుకుంటున్నారు.

సింధు అక్క అరుణ,గోపి అన్న గోపాల్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఈ క్రమంలో చిన్న కుమార్తె సింధును గోపాల్ తమ్ముడు గోపికి ఒకే కుటుంబంలో ఇచ్చేందుకు అమ్మాయి తల్లి దండ్రులు నిరాకరించారు. వీరి ప్రేమ వ్యవహారం తెలిసి పలు పర్యాయాలు ఇరు కుటుంబాలు మధ్య చర్చిలు జరిగినా ఒకే కుటుంబంలో మరో కుమార్తెను ఇచ్చేందుకు వారు ఇష్టపడలేదు. పెద్దలు మాట్లాడి కొంత సయమం తీసుకొని చెప్తామని చెప్పడంతో మనస్తాపం చెందిన సింధు, గోపి,20వ తేదీ రాత్రి 10గంటల తర్వాత ఇంటి నుంచి వెళ్లి పోయారు.తెల్లవారుజామున గోపి తండ్రి శ్రీనుకి ఫోన్ చేసి పురుగుల మందు తాగి ఇద్దరం చనిపోతున్నామంటూ ఫోన్ స్విచ్చాఫ్ చేశాడు. దీంతో ఇరుకుటుంబాలు గ్రామస్తులతో కలిసి ఆచూకీ కోసం గాలించారు.అన్నారుపాడు సరిహద్దు సమీపంలోని బీమ్లా పొలంలో ఇద్దరూ అపస్మారకస్థితిలో పడి ఉండటాన్ని చూసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందారు.పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గ్రామస్తులను కలిచివేసింది. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నా యి.సింధు తండ్రి లక్ష్మణ్, గోపి తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు రెండు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ శివాజీ పేర్కొన్నారు.

190
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles