జ్వరంతో ముగ్గురు మహిళలు మృతి

Mon,September 23, 2019 07:28 AM

వైరా, నమస్తే తెలంగాణ: మండలంలోని తాటిపూడి గ్రామానికి చెందిన పిడియాల యశోద(38) తీవ్ర జ్వరంతో శనివారం రాత్రి మృతి చెందింది. నాలుగైదు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న యశోదకు ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

లక్ష్మీదేవిపల్లి మండలంలో...
లక్ష్మీదేవిపల్లి: మండలంలోని హర్యాతండా గ్రామానికి చెందిన అజ్మీరా రాజి(45)ఆదివారం తీవ్ర జ్వరంతో బాధపడుతూ మృతి చెందింది. కొన్ని రోజులుగా రాజికి జ్వరం వస్తుండగా, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లినా జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో పరిస్థితి విషమించడంతో మృతి చెందిందని కుటుంబ సభ్యులు తెలిపారు.

చుంచుపల్లి మండలంలో...
చుంచుపల్లి: మండలంలోని విద్యానగర్ పంచాయతీలోని పశువుల వైద్య శాల దగ్గర నివసిస్తున్న కొండపాక మాలతి(33) జ్వరంతో మృతిచెందింది. కొద్దిరోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లో వైద్యం తీసుకుంటున్నారు. కాగా ఆదివారం జ్వరం తీవ్రంగా ఉండి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మాలతి భర్త రామకృష్ణమాచార్యులు ప్రైవేటు లెక్చరర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. మృతిచెందిన విషయం తెలిసిన విద్యానగర్ కాలనీ పంచాయతీ కో-ఆప్షన్ సభ్యుడు వాడపల్లి జకరయ్య మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles