శృతిహాసన్ సందడి..

Mon,September 30, 2019 11:46 PM

-నగరంలో వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన సినీనటి
-చూడడానికి పోటీ పడిన అభిమానులు
ఖమ్మంలో సినీనటి శృతిహాసన్ సౌభాగ్య షాపింగ్‌మాల్లో సందడి..
ఖమ్మం కల్చరల్ సెప్టెంబర్30: నగరంలోని కస్బాబజార్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సౌభాగ్య షాపింగ్ మాల్‌ను సోమవారం సినీనటి శృతిహాసన్ ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి పలు రకాల వస్ర్తాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ఖమ్మం చాలా అందంగా ఉందన్నారు. సౌభాగ్య షాపింగ్ మాల్ అనేక రకాల ఆధునాతన వస్ర్తాలతో అన్ని వర్గాలు, వయసుల వారికి నప్పే వస్ర్తాలున్నాయన్నారు. తెలుగు, హిందీ, తమిళం సినిమాలలో నటించిన తాను త్వరలో ఆంగ్ల సినిమాలో కూడా నటించబోతున్నానని తెలిపారు. తెలుగులో ఇంకా పేరు పెట్టని మరో ప్రాజెక్టుకు పని చేస్తున్నానన్నారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు పెరుమాళ్ల శ్రీనివాసరావు, పెరుమాళ్ల అనిల్‌లు మాట్లాడుతూ.. ఫ్యాషన్ ప్రపంచంలో ఖమ్మంకు నూతన ట్రెండ్ తీసుకురావడమే సౌభాగ్య లక్ష్యమన్నారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు, నిర్వాహకులు పెరుమాళ్ల శ్రీనివాసరావు, అనిల్, దారా ప్రవీణ్ పాల్గొన్నారు. షాపింగ్ మాల్ బయట కస్పాబజార్‌లో అభిమానులు శృతిహాసన్‌ను చూడటానికి కిక్కిరిసిపోయారు. కస్పాబజార్‌లో కాసేపు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

226
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles