4న సింగరేణి లాభాల వాటా చెల్లింపు

Wed,October 2, 2019 02:32 AM

కొత్తగూడెం సింగరేణి, అక్టోబర్ 1 : సింగరేణి సంస్థ 2018-19 ఆర్థిక సంవత్సరంలో అర్జించిన నికర లాభాలపై సీఎం కేసీఆర్ ప్రకటించిన 28 శాతం లాభాల వాటాను కార్మికులకు, అధికారులకు, ఉద్యోగులకు ఈ నెల 4వ తేదీన చెల్లించనున్నట్లు జీఎం పర్సనల్ (ఆర్‌సీ, ఐఆర్ అండ్ పీఎం) ఆనందరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంస్థ అర్జించిన లాభాల్లో హాజరుశాతానికి అనుగుణంగా రూ.410.57 కోట్లు (83 శాతం), ఇన్‌సెంటీవ్‌పై రూ.14.84 కోట్లు (3 శాతం), గ్రూప్ పెర్ఫార్మెన్స్ కింద రూ.69.25 కోట్లు (14 శాతం) మొత్తం సింగరేణి వ్యాప్తంగా పనిస్తున్న ఎన్‌సీడబ్ల్యూ, ఎగ్జిక్యూటీవ్స్ కలిపి మొత్తం 47,481 మందికి రూ.494.66 కోట్లు వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నామన్నారు.

165
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles