శిశువును చంపిన కసాయితండ్రి

Wed,October 2, 2019 02:32 AM

చర్ల, అక్టోబరు 1 : అడపిల్ల పుట్టిందని నెలల పిల్లను హతమార్చిన కసాయితండ్రి ఉదంతం చర్ల మండలంలో జరిగింది. చర్ల మండలం రేగుంట గ్రామానికి చెందిన అడబాల సూర్యతేజ భార్య అఖిలకు రెండో కాన్పులో కూడా ఆడపిల్ల పుట్టిందని అందుకే ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సూర్యతేజ భార్య అఖిల బంధువుల కథనం ప్రకారం.. సూర్యతేజ శిశువును నీటితొట్టిలో వేసి హత్యచేసినట్టు తెలుస్తోంది. సోమవారం రాత్రి అఖిల తన చంటిబిడ్డతో ఇంట్లో నిద్రిస్తోంది. బిడ్డను వదిలి బహిర్భూమికి వెళ్లి వచ్చే సరికి మంచంలో బిడ్డ కనిపించ లేదు. పక్కనే ఉన్న భర్త సూర్యతేజను లేపి అడిగితే తనకేమీ తెలియదని సమాదానం చెప్పాడు. అఖిల బిడ్డ కనిపించటం లేదని తల్లిదండ్రులకు తెలుపగా ఇంటిల్లిపాది పసికూన కోసం వెతికారు. సమీపంలోని నీటితొట్టిలో బిడ్డ నిర్జీవంగా పడి ఉంది. ఆడపిల్ల ఇష్టం లేని సూర్యతేజే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తూ పోలీసులకు సమాచారం అందజేశారు. సూర్యతేజను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

167
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles