స్టార్‌సింగర్ అవార్డు గెలుచుకున్న అజయ్

Wed,October 2, 2019 02:33 AM

కొణిజర్ల, అక్టోబర్ 1 : పల్లిపాడుకు చెందిన యాదగిరి అజయ్‌కుమార్ తన పాటల ప్రస్థానంలో మరో మైలురాయిని అధిగమించారు. ప్రతిపాటల పోటీలో తనదైన శైలితో ముందుకెళ్తున్న అజయ్ మంగళవారం చెన్నైలో జరిగిన జాతీయస్థాయి పాటల పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమస్థానం సాధించాడు. ఈ పోటీలో దేశంలోని 29 రాష్ర్టాలకు చెందిన 3333మంది గాయకులు తమ పేర్లను నమోదు చేసుకోగా చిట్టచివరగా పేరు నమోదు చేయించుకున్న అజయ్ పోటీలో మాత్రం ప్రథమస్థానం సాధించాడు. ప్రతి పాటల పోటీలను మెరుగైన ప్రతిభ చూపుతున్న అజయ్‌కుమార్ జనవరిలో అమెరికాలో నిర్వహించే అంతర్జాతీయ పాటల పోటీలకు ఇండియా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాడు. మంగళవారం జరిగిన జాతీయస్థాయి పాటల పోటీల్లో అజయ్‌కు కింగ్‌ఆఫ్ ఎమోషనల్‌సాంగ్స్ అనే బిరుదును ఇచ్చినట్లు తెలిసింది. ఈ సందర్భంగా విజేత అజయ్‌ను ఫ్రెంట్స్‌యూత్ అధ్యక్షుడు తాటిపల్లి సుదీర్, పల్లిపాడు గ్రామస్తులు శుభాకాంక్షలు తెలిపారు.

186
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles