వైభవంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు

Wed,October 2, 2019 02:33 AM

ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు మూడోరోజు మంగళవారం వైభవంగా నిర్వహించారు. దీనిలో భాగంగా అమ్మవారిని గాయత్రీదేవీగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. గోమాతకు పూజలు నిర్వహించారు. మంగళవారం కావడంతో శ్రీప్రసన్నాంజనేయ స్వామివారికి తమలపూజ, హనుమాన్‌చాలిసా పారాయణం నిర్వహించారు. ఖమ్మం జిల్లా ఫ్యామిలీ కోర్టు జడ్జీ పీ.జమలేశ్వరరావు దంపతులు శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జడ్జీ దంపతులను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల వెంకట జయదేవశర్మ, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారికి స్వామివారి శేషవస్ర్తాలను బహుకరించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

168
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles