పుడమిపై పూల సందడి.. నాల్గోరోజు బతుకమ్మ సంబురాలు

Wed,October 2, 2019 02:34 AM

-పోలీస్, ఫారెస్ట్, విద్యుత్ ఉద్యోగుల ఆటాపాట..
ఖమ్మం కల్చరల్ : చిత్తు.. చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా..! బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో... నానబియ్యం బతుకమ్మ ఉయ్యాలో..!.. అంటూ ఉయ్యాల, కోల్, గౌరమ్మ పాటలతో నాల్గవరోజు మంగళవారం నానబియ్యం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. పలు ఆలయాల ప్రాంగణాలు, కూడళ్లు, చెరువుగట్ల వద్ద బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. గౌరమ్మను భక్తి ప్రపత్తులతో పూజించింన అనంతరం పలు పాటలతో నృత్యాలు చేస్తూ బతుకమ్మలను ఓలలాడించారు. బతుకమ్మకు నానబియ్యం ప్రసాదంగా నివేదన చేశారు.

పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో...
లాఠీలు... తుపాకులు... ఒక్క రోజు పూలయ్యాయి.. ఖాకీ యూనిఫాంలు పూల శిఖరాలకు సెల్యూట్‌లు చేశా యి.. ప్రకృతి, ఆధ్యాత్మిక, శాస్త్రీయం, సంతోషం, వినోదాల మేళవింపుగా గల బతుకమ్మలకు పోలీసులు, వారి కుటుంబ సభ్యులు మంగళవారం సాయంత్రం పూజలు చేసి అందరినీ చల్లంగా చూడాలని ఆ గౌరమ్మను ప్రార్థించారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో పోలీస్ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. అడిషననల్ డీసీపీ అడ్మిన్ ఇంజారపు పూజ తొలుత గౌరమ్మకు పూజలు చేసి సంబురాలను ప్రారంభించారు. అధిక సంఖ్యలో మహిళలు రావడంతో స్టేడియం హరివిల్లులను పరిచింది. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, ట్రాఫిక్ ఏసీపీ సదానిరంజన్, ఏఆర్ ఏసీపీ విజయబాబు, సీఐలు రమేష్, అంజలి, శ్రీధర్, శివసాంబిరెడ్డి, ఏఓ అక్తరున్నీసాబేగం, ఆర్‌ఐ శ్రీనివాస్, నాగేశ్వరరావు, రవి, ఆర్‌ఎస్‌ఐ నాగేశ్వరరావు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ప్రొహిబిషన్ ఎక్సైజ్ కార్యాలయ ఆవరణలో..
నగరంలోని ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్1ఆవరణలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఏఈఎస్‌లు కిరణ్, సైదులు, సీఐలు రాజు, రమ్య, జయశ్రీ, సర్వేశ్వరరావు, ఎస్‌ఐలు శార్వాణి, సౌమ్య, సిబ్బంది పాల్గొన్నారు.

తెలంగాణ భవన్‌లో...
నగరంలోని టీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ భవన్‌లో నానబియ్య బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, కార్పోరేటర్ కమర్తపు మురళిలు బతుకమ్మలను పసుపు కుంకుమలతో పూజలు చేసి ఇతర మహిళలతో కలిసి బతుకమ్మ ఆటపాటలాడారు. న్యాయవాద జేఏసి చైర్మన్ బిచ్చాల తిరుమలరావు, తన్నీరు శోభారాణి, భారతి, తార తదితరులు పాల్గొన్నారు.

అటవీశాఖ ఆధ్వర్యంలో..
అటవీశాఖ ఆధ్వర్యంలో నగరంలోని అటవీశాఖ కార్యాలయ ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. తొలుత జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ బతుకమ్మలకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి మా ట్లాడారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే బతుకమ్మ పండుగను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం మ నందరి బాధ్యత అన్నారు. ఈ పండుగను విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ జాగృతి కృషి చారిత్రాత్మకంగా నిలిచిపోతుందన్నారు. అటవీశాఖ అధికారులు, ఉద్యోగులంతా కలిసి బతుకమ్మ ఆటపాటల్తో సందడి చేశారు. కార్యక్రమంలో రేంజ్ అధికారులు రా ధిక, జ్యోత్స్న, విజయలక్ష్మి, కవిత, డివిజన్ ఫారెస్ట్ అధికారి సతీష్ సతీమణి వనిత, కవిత, నాగమణి, అరుణ, అనూష, రేణుక, వరలక్ష్మి, భాగ్య, పావని పాల్గొన్నారు.

నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో..
తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కోడి లింగయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను చాటే బతుకమ్మ పండుగ రాష్ట్ర ఆడపడుచుల సౌభాగ్య పండుగ అన్నారు. అధిక సంఖ్యలో మహిళా ఉద్యోగులు పాల్గొని బతుకమ్మ ఆటపాటలాడారు. కళాకారుల బృందాలు సందడి చేశాయి. కార్యక్రమంలో తహసీల్దార్లు రమణి, చంద్రశేఖర్, ఉద్యోగ సంఘ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు, పి.రామయ్య, బాలకృష్ణ, దుర్గాప్రసాద్, ఆర్. వెంకటేశ్వరరావు, గట్టికొండ నాగేశ్వరరావు, అంజమ్మ, గిరిజకుమారి, కళావతి తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌శాఖ ఆవరణలో...
నగరంలోని మామిళ్లగూడెం ఎన్‌పీడీసీఎల్ సర్కిల్‌లో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. ఎస్‌ఈ రమేష్ బతుకమ్మకు పసుపు కుంకుమలతో పూజలు చేసి సంబురాలను ప్రారంభించారు. కార్యక్రమంలో డీఈలు ఎన్.రామారావు, బాబురావు, కృష్ణ, ఎల్.రాములు, ఏడిఇ రమేష్ చక్రవర్తి, ఏఏఓ కృష్ణారావు, శ్రీధర్, ఏఈలు,ఉద్యోగులు మాధవి,మమత, చంద్రకళ, శ్రీజ , యూనియన్ నాయకులు శేషగిరి, సీతారామయ్య, గోపాల్, సత్యనారాయణరెడ్డి, రవి, లక్ష్మీనర్సింహారావు, యుగంధర్,పాష, ప్రసాద్ తదితరులు బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు.

196
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles