భర్త కనిపించటంలేదని భార్య ఫిర్యాదు

Thu,October 3, 2019 12:50 AM

ముదిగొండ, అక్టోబర్ 2: ప్రేమ వివాహం చేసుకున్న యువతి తన భర్త కనిపించటం లేదని స్థానిక పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే... మండల పరిధిలోని వెంకటాపురం గ్రామానికి చెందిన మేడ శిరీష, ముదిగొండ గ్రామానికి చెందిన రాజులు ప్రేమించుకుని రాజు కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోయినా ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి వీరు మండల పరిధిన్యూ లక్ష్మీపురం గ్రామంలో నివసిస్తున్నారు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజు సెప్టెంబర్ 18న పనిపై ఖమ్మం వెళ్లిన రాజు నేటికి తిరిగి ఇంటికి రాలేదు. శిరీష స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికినా జాడ దొరకలేదు. దీంతో శిరీష ముదిగొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త తరుచుగా తన బంధువులతో ఫోనులో మాట్లాడుతాడని వారే తన భర్తను తీసుకెళ్లి వుంటారని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.

189
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles