నీటితొట్టిలో పడి బాలుడి మృతి

Thu,October 3, 2019 12:51 AM

కామేపల్లి, అక్టోబర్ 2: ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన బుధవారం మండలంలోని జోగ్గూడెంలో చోటుచేసుకుంది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన అజ్మీర రమేష్,సోని దంపతుల కుమారుడు మోహిత్ (2) ఇంటి ఆవరణలో ఆడుకుంటు వెళ్లి ప్రమాదవశాత్తు నీటితొట్టిలో పడ్డాడు. ఇంటి పనిలో నిమగ్నమైన తల్లి కొంత సమయం తరువాత కుమారుడి కోసం వెతుకుతుండగా నీటితొట్టిలో కన్పించాడు. అప్పటికే మోహిత్ మృతి చెందాడు. మోహిత్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

179
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles