గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

Thu,October 3, 2019 12:51 AM

ఖమ్మం రూరల్, నమస్తేతెలంగాణ, అక్టోబర్ 2 : రూరల్ మండలం తీర్థాల ఆకేరులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..రూరల్ మండలం తీర్థాల గ్రామానికి చెందిన నునావత్ చందా(65) అనే వ్యక్తి మంగళవారం పశువుల కోసమని ఆకేరు దాటుతండగా గల్లంతైన విషయం తెలిసిందే. స్థానిక సర్పంచ్ తేజావత్ బాలునాయక్ గజ ఈతగాళ్లతో బుధవారం గాలింపుచర్యలు చేపట్టగా చందా శవం లభ్యమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్రావ్ తెలిపారు.

181
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles