మంత్రులకు ఘన స్వాగతం పలికిన నేతలు, అధికారులు

Thu,October 3, 2019 12:51 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ: మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని ఖమ్మం నగరం గాంధీచౌక్‌లోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించేందుకు బుధవారం హైద్రాబాద్ నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం వచ్చిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర గిరిజనాభివృద్ది , స్త్రీ శిశు సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావులకు జిల్లా అధికారులు, టీఆర్‌ఎస్ నాయకులు బుధవారం ఘనంగా స్వాగతం పలికారు.స్థానిక పెవిలియన్ గ్రౌండ్‌లో మంత్రులు హెలికాప్టర్ దిగిన వెంటనే జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, నగర మేయర్ డాక్టర్ పాపాలాల్,శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మినారాయణ, విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, ఖమ్మం నగరపాలక సంస్థ కమిషనర్ జె.శ్రీనివాసరావు, టీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఆర్‌జేసి కృష్ణ , కార్పొరేటర్లు చావా నారాయణరావు, పోట్ల వీరేందర్ తదితరులు స్వాగతంపలికి శాలువాలతోసన్మానించి ఘనంగా సత్కరించారు.

233
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles