శ్రీధనలక్ష్మి అలంకారంలో అమ్మవారు

Thu,October 3, 2019 12:51 AM

-నేడు ధాన్యలక్ష్మీ అలంకారంలో దర్శనమివ్వనున్న అమ్మవారు
భద్రాచలం, నమస్తే తెలంగాణ అక్టోబర్2: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు శ్రీధనలక్ష్మీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామునే రామాలయం తలుపులు తెరిచి అర్చక స్వాములు స్వామివారికి సుప్రభాతసేవ, ఆరాధన, ఆరగింపు, సేవాకాలం తదితర పూజలు నిర్వహించారు. స్థానిక చిత్రకూట మండపంలో ఉదయం 6గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు సామూహిక శ్రీరామాయణ పారాయణం నిర్వహించారు. శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించి శ్రీధనలక్ష్మిగా అలంకరించి భక్తుల సందర్శనార్ధం ఉంచారు. సాయంత్రం 3నుంచి 5గంటల వరకు శ్రీలక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో సామూహిక కుంకుమార్చన పూజలు నిర్వహించారు. సాయంత్రం 6నుంచి 7.30 నిమిషాల వరకు విశేష దర్బార్‌సేవ, నివేదన, మహామంత్రపుష్పం, ప్రసాదగోష్ఠి తదితర పూజలు చేశారు. శ్రీ ధనలక్ష్మి అలంకారంలో ఉన్న అమ్మవారిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాత్రి 7.30నుంచి 8.30వరకు శ్రీవారి తిరువీధిసేవ జరిపారు.

నేడు ధాన్యలక్ష్మీ అలంకారంలో అమ్మవారు..: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు గురువారం శ్రీధాన్యలక్ష్మి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ధన ధాన్యకరీం...సిద్ధిం అంటూ కీర్తిస్తుంది పురాణం.

246
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles