అట్ల బతుకమ్మా..!ఆదరించమ్మా...!!

Thu,October 3, 2019 12:53 AM

-పూలను పూజించే సంస్కృతి తెలంగాణకే దక్కింది..
-జిల్లా వ్యాప్తంగా ఘనంగా బతుకమ్మ వేడుకలు
-కలెక్టరేట్‌లో వేడుకలకు హాజరైన కలెక్టర్ కర్ణన్..
-తెలంగాణ భవన్‌లో పూజలు చేసిన ఎంపీ నామా

ఖమ్మం కల్చరల్ అక్టోబర్ 2: బతుకమ్మ.. బతుకమ్మ.. ఉయ్యాలో... శ్రీలక్ష్మీ నీ మహిమలో గౌరమ్మా... ఒక్కొక్క పూవేసి చందమామ.. అంటూ ఆడపడుచులు బతుకమ్మ ఆటపాటల్లో మునిగి తేలారు. అయిదవరోజు బుధవారం అట్ల బతుకమ్మ వేడుకలను వాడవాడల్లో ఘనంగా నిర్వహించారు. బియ్యం పిండితో తయారు చేసిన దోశలను గౌరమ్మకు నివేదించి, పసుపు కుంకుమలతో పూజించారు. ఖమ్మం వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, కలెక్టరేట్, తెలంగాణ భవన్, తెలంగాణ జాగృతి, ఐద్వా ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెంటింగ్ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని మార్కెట్‌లో నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాయి. కోలాటాలు, నృత్యాలు రంగు రంగుల బతుకమ్మల చుట్టూ కనుల పండువ చేశాయి.. తొలుత ఏఎంసీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, జిల్లా మార్కెటింగ్ శాఖాధికారి రత్నం సంతోష్‌కుమార్‌లు పూజలు చేసి సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర సాధన అనంతరం బతుకమ్మ పండుగకు జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి పెరిగి, మరింత వైభవాన్ని చాటుకుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులు, గ్రేడ్-2అధికారి బజార్, అసిస్టెంట్ కార్యదర్శి వెంకటేశ్వరరెడ్డి, ఉమ్మడి జిల్లా మార్కెట్ కమిటీ ఉద్యోగుల కన్వీనర్ పీ నిర్మల, కో కన్వీనర్ పీ వీరాంజనేయులు, మార్కెట్ కమిటీల బాధ్యులు, కార్మిక సంఘంనాయకుడు నున్నా మాధవరావు, రైతుబజార్‌ల ఎస్టేట్ అధికారులు శ్వేత, పద్మ, రైతులు, వ్యాపారులు తదితరులు పాల్గొన్నారు.

కలెక్టరేట్ ఆవరణలో...
కలెక్టరేట్ ఆవరణలో అధికారులు, ఉద్యోగులు బతుకమ్మ ఆటపాటలతో సందడి చేశారు. కలెక్టర్ ఆర్.వి కర్ణన్ బతుకమ్మను పసుపు కుంకుమలతో పూజించి, బతుకమ్మ ఆటపాటల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్ కర్ణన్ మాట్లాడుతూ ప్రకృతి మాతను కొలిచే ఈ పండుగకు ఎంతో ప్రాశస్త్యముందన్నారు. రాష్ట్రంలో ఈ పండుగకు ఎనలేని ప్రాధాన్యతను తీసుకొచ్చిన తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవం మరింత పెరిగిందని న్నారు. కార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి శిరీష, కలెక్టరేట్ పాలనాధికారి మదన్‌గోపాల్, సత్యనారాయణ, రమణి, భద్రకాళి, శైలజ, రజిత కిషోర్, స్వర్ణ, ఉషారాణి, జిల్లా కోశాధికారి రవికుమార్, ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.

తెలంగాణ భవన్‌లో...
నగరంలోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. ఎంపీ నామా నాగేశ్వరరావు బతుకమ్మకు పసుపు, కుంకుమలతో పూజలు చేసి సంబురాలను ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో ఆడపడుచులకు ఒక కోటి 20 లక్షల మందికి చీరలు పంపిణీ చేసిన ఘనత రాష్ర్టానికే దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారని, ఉద్యమంలో, బంగారు తెలంగాణ సాధనలోబతుకమ్మ ఒక సాధనంగా పని చేస్తుందన్నారు. ఆడపడుచుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేయడం గర్వకారణమన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, మహిళా నాయకులు మద్దినేని బేబి స్వర్ణకుమారి, భారతీరాణి,కృష్ణకుమారి, కవితారాణి, అనురాధ, కోడెం తార, టీఆర్‌ఎస్ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, బిచ్చాల తిరుమలరావు, మందపాటి వెంకటేశ్వర్లు, జలగం రామకృష్ణ, రాజేందర్, సురేష్, తేజావత్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య (ఐద్వా) ఆధ్వర్యంలో బ్యాంక్ కాలనీలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పి.రమ్య, అమరబోయిన అంజని, మాచర్ల మారుతి, నాగమణి, నాగరత్నం,లలిత, బాలసాని సామ్రాజ్యం, శ్రావణి , అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

251
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles