సద్దుల బతుకమ్మకు ఏర్పాట్లు

Fri,October 4, 2019 12:33 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ : ఈనెల 6న జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేయనున్నట్లు ఖమ్మం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ జీ పాపాలాల్ తెలిపారు. గురువారం సాయంత్రం అయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శిక్షణ కలెక్టర్ ఆదర్శ్ సురభి, కమిషనర్ జే శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడారు. ఆరవ తేదీన సాయంత్రం 6గంటలకు నయబజార్ కళాశాల మైదానంలో వేడకలు ప్రారంభమవుతాయన్నారు. రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఈ వేడుకలను ప్రారంభించడం జరుగుతుందన్నారు. వేడుకలకు వచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. కళాశాల మైదానంలో అవసరమైన మేర తాగునీరు, మెడికల్ క్యాంపుతో పాటు బతుకమ్మలను వదిలే మున్నేరువాగు దగ్గర కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.బతుకమ్మ వేడుకలలో భాగంగా శుక్రవారం కార్పొరేషన్ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్‌బండ్‌పై వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.సాయంత్రం 5గంటలకు వేడుకలు ప్రారంభమవుతాయన్నారు. అన్నిశాఖల అధికారులు, నగర మహిళలు భారీగా హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఫ్రీ ప్లాస్టిక్ ఖమ్మం నగరంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకో బోతున్నట్లు మేయర్ తెలిపారు. ఇప్పటికే పలు దఫాలుగా అవగాహన సదస్సులు ఆయా వర్గాల వారితో చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగానే కార్పొరేషన్ పరిధిలో ఇన్‌స్పెక్టర్ అధ్వర్యంలో ప్రత్యేకంగా 14 బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఒక్కో టీంలో ఆరుగురు సభ్యులు ఉంటారని ప్లాస్టిక్ వినియోగం, క్రయవిక్రయాలపై సదరు కమిటీలు ఎప్పటికపుకప్పుడు మానిటరింగ్ చేయడం జరుగుతుందన్నారు. నిబంధలకు విరుద్ధంగా ప్లాస్టిక్ సంచుల వినియోగం చేపడితే రూ500 నుంచి 5వేల వరకు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ వినియోగించే వారిపై ఫిర్యాదులు చేయాలనుకునే వారి కోసం ప్రత్యేకంగా 7901298201 అనే వాట్సప్ నెంబర్ ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. ఫొటోలు, సమాచారం మాత్రమే తెలియజేయాలని ఆయన సూచించారు. నగరవాసులు ఈ విషయంలో సహకరించాలని, ఫ్రీ ప్లాస్టీక్ నగరంగా తయారు చేసుకు నేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు.పాస్టిక్ నిషేధానికి సంబంధించిన కరపత్రికను ఆవిష్కరించారు.

195
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles