9 నుంచి ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల స్వీకరణ

Fri,October 4, 2019 12:33 AM

ఖమ్మం క్రైం:పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థులు పూరించిన అటెస్టేషన్ ఫారాలను ఈ నెల 9 నుంచి 12 వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో అందజేయాలని ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం గురువారం ప్రకటన విడుదల చేసింది. గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ ఫారాలతో పాటు విద్యార్హతల ధ్రువీకరణ ప్రతాలకు సంబంధిన ఫారాలను అందజేయాలని కోరారు. ప్రత్యేక కౌం టర్లలో అయా తేదిలల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించడం జరుగు తుందనన్నారు. అభ్యర్థులు ఇటీవల దిగిన నాలుగు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను వెంట తీసుకురావాలని సూచించారు.

231
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles