ఖమ్మంలో జిమ్నాస్టిక్స్ టోర్నీ ప్రారంభం

Fri,October 4, 2019 12:33 AM

మయూరిసెంటర్: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, డీవైఎస్‌వో ఎం పరంథామరెడ్డి , వద్దిరాజు నిఖిల్ లు అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో దక్షిణ జాతీయ జిమ్నాస్టిక్స్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ట్రైనీ కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే అం డర్ -10 అండర్- 18 పోటీలకు నాలుగు రాష్ర్టాల క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడాకారులకు జి మ్నాస్టిక్స్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా జిమ్నాస్టిక్స్ వెల్ఫేర్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వీ అరుణ, కే రూప, జిమ్నాస్టిక్ కోచ్ గౌస్‌లు మాట్లాడుతూ తెలంగాణ టీమ్ నుంచి రిథమిక్ జిమ్నాస్టిక్‌లో 30 మంది క్రీడాకారులు, ఆక్రో బైటిక్ జిమ్నాస్టిక్స్‌లో 28 మంది క్రీడాకారులు తమ అత్యుత్తమ ప్రతిభను చూపారని తెలిపారు. .

204
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles