13 నుంచి సహస్ర చండీయాగం

Sat,October 5, 2019 11:50 PM

-ఏర్పాట్లు పరిశీలించిన మాజీ ఎంపీ పొంగులేటి
కల్లూరు: మండల పరిధిలోని నారాయణపురంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగృహంలో ఈనెల 13 నుంచి 17 వరకు జరిగే సహస్ర చండీయాగం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. శనివారం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా సరెడ్డి యాగం పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగురాష్ర్టాల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేందుకు ఈ యాగం నిర్వహిస్తున్నామని, ఈ యాగానికి పలు రాష్ర్టాల నుంచి పీఠాధిపతులు హాజరవుతున్న దృష్ట్యా పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతారని, వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలి పారు. ఆయన వెంట సోదరుడు ప్రసాదరెడ్డి, నాయకులు మట్టా దయానంద్, కీసరి వెంకటేశ్వ రరెడ్డి, తుంబూరు దయాకర్‌రెడ్డి ఉన్నారు.

208
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles