ఖమ్మం నగరంలో మోస్తరు వర్షం

Sat,October 5, 2019 11:50 PM

ఖమ్మం వ్యవసాయం:భూఉపరితల, అల్పపీడన ప్రభావంతో శనివారం ఖమ్మం నగరంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భానుడి ప్రతాపం, సాయంత్రం వేళ వరుణిడి కరుణతో ఒక్కసారిగా భారీ ఉరుములతో కూడిన వర్షం కురిసింది. దీంతో నగర ప్రధాన వీధులతో పాటు శివారు కాలనీలు సైతం జలమ మమయ్యాయి. దాదాపు 40 నిమిషాల పాటు ఏకధాటిగా వర్షం పడడంతో వరద నీరు వీధుల్లోకి చేరింది. సా యంత్రం వేళ కార్యాలయయాల నుంచి ఇంటికి చేరుకునే ఉద్యోగులు, కార్మికులు ఒకింత ఇబ్బందులకు లోనయ్యారు. నాలాలు పొంగడంతో ఒక్కసారిగా వరద నీరు చేరుకోవడంతో బస్టాండ్ సెంటర్, మయూరి సెంటర్, డీఆర్‌డీఏ ప్రాంతం, కమాన్‌బజార్, కస్బాబజార్‌తో ప్రాంతంలోని ప్రాంతాలలోని సమీప కాలనీలు జలమయం అయ్యా యి. దీంతో కాసేపు ఎక్కడివారు అక్కడే ఉండిపోయారు. బస్టాండ్ సెంటర్, త్రీటౌన్ ప్రాంతాలలో కొద్ది సేపు రవాణకు అంతరాయం కలిగింది. పాదాచారులతోపాటు, వాహనదారులు సైతం కాలు కదపని పరిస్థితి నెలకొంది.

217
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles