అంకితభావంతో విధులు నిర్వర్తించండి...

Sat,October 5, 2019 11:51 PM

ఖమ్మం ఎడ్యుకేషన్: నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని డీఈవో మదన్‌మోహన్ విద్యాశాఖ ఉద్యోగులకు సూచించారు. శనివారం డీఈవో కార్యాలయంలోని అన్ని సెక్షన్‌లో పనిచేస్తున్న సిబ్బందితో సుమార్ మూడు గంటల పాటు సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పాఠశాల వ్యవస్ధ కార్యాకలాపాలకు సంబంధించిన ప్రతి ఫైల్‌ను విద్యాశాఖ కార్యాలయం నుంచే సాగుతాయని ఎక్కడా నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. విద్యాశాఖతో పాటు సర్వశిక్ష అభియాన్, ఆర్‌ఎంఎస్‌ఏ, కేజీబీవీల విభాగాలకు సంబంధించి నిధుల వ్యయం ఫైల్స్ పరీశీలనలో నియమనిబంధనలు పాటించాలని, నిర్లక్ష్యం వహించరాదన్నారు. విద్యాశాఖ కార్యాలయంలో పర్యవేక్షణ చేసే ఏడీ నుంచి మొదలు రికార్డు అసిస్టెంట్ వరకు సమయపాలన పాటించాలని, ఉత్తమ ఉద్యోగులుగా రాణించేలా పనితీరు మెరుగుపర్చుకోవాలని కోరారు. ఇన్‌వార్డ్ నుంచి వచ్చే ప్రతి ఫైల్‌కి పరిష్కారం చూపాలన్నారు. ఉపాధ్యాయులకు సంబంధించిన మెడికల్, సర్వీస్ సెక్షన్‌లలో పనిచేసే వారు ఫైల్స్ పెండింగ్‌లో ఉంచోద్దన్నారు. సెక్టోరల్ అధికారులు తమ చార్ట్ ప్రకారం విధులు కొనసాగించాలన్నారు. సమావేశంలో సూపరిండెంట్ చక్రపాణి, జీసీడీవో చల్లపల్లి ఉదయ్‌శ్రీ, కార్యాలయ ఉద్యోగులు జీఎస్ ప్రసాద్, షకీల్, మాధవరావు, మురళీకృష్ణ, నగేశ్, నందగోపాల్, నరుకుళ్ళ శ్రీనివాస్, వజ్జా కిశోర్‌కుమార్, యూసఫ్, దేవేందర్, రామకృష్ణ, కిరణ్ పాల్గొన్నారు.

229
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles